హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో ఓ యువకుడిని కొట్టి చంపడం తీవ్ర కలకలం రేపుతోంది. సతీష్, ప్రేమ్ మధ్య పాత కక్షలు ఉన్నాయి. ప్రేమ్‌ని ఏదో ఒకటి చేయాలని సతీష్, అతని ఫ్రెండ్స్ డిసైడయ్యారు. అందరం కలిసి గాంజా తాగి ఎంజాయ్ చేద్దామంటూ ప్రేమ్‌ను పిలిపించారు. మద్యం మత్తులో ఉండగా.. అతన్ని కొట్టి చంపారు.