తెలుగు రాష్ట్రాల్లో 26న ఎమ్మెల్సీ ఎన్నికలు

Update: 2019-08-01 13:30 GMT

తెలుగు రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఏపీలో మూడు స్థానాలకు, తెలంగాణలో ఒక స్థానానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది సీఈసీ. ఏపీలో కరణం బలరాం, కాళీకృష్ణ శ్రీనివాస్, వీరభద్రస్వామి రాజీనామాతో.. మూడు స్థానాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.

ఇక తెలంగాణలో యాదవరెడ్డిపై అనర్హత వేటుతో ఖాళీ అయిన ఒక స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఆగష్టు 7న నోటిఫికేషన్‌ విడుదల కానుండగా.. నామినేషన్ల చివరి తేదీ 14. ఆగష్టు 16న నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 19 వరకు గడువు ఇచ్చింది ఎన్నికల సంఘం. ఈ నెల 26న ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఓట్లు లెక్కిస్తారు.

Similar News