సరైన సమయానికి 108 వాహనం రాకపోవడంతో కృష్ణా జిల్లా గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ విద్యార్థి మృతి చెందాడు. పరీక్ష రాసి వస్తుండగా రాకేష్ అనే యువకుడు అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతని స్నేహితులు గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో.. విజయవాడ తీసుకెళ్లాలన్న వైద్యులు చెప్పడంతో 108కి రాకేష్ స్నేహితులు ఫోన్ చేశారు. అయితే 108 వాహనం గవర్నర్ కాన్వాయ్‌లో ఉందని..చెప్పిన సిబ్బంది తాము రాలేమని చెప్పారు. దీంతో సకాలంలో వైద్యం అందక రాకేష్ మృతి చెందాడు.