జమ్మూకాశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో శ్రీనగర్ నిట్‌లో చదువుతున్న 130 మంది తెలుగు విద్యార్థులను రాష్ట్రానికి రప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. తాము హైదరాబాద్‌కు వచ్చేందుకు సహాయం చేయాలంటూ నిట్ విద్యార్థులు.. కేటీఆర్‌ను కోరారు. దీనిపై వెంటనే స్పందించిన కేటీఆర్.. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందొద్దని భరోసా ఇచ్చారు. స్టూడెంట్స్‌ను హైదరాబాద్ తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలంటూ కేటీఆర్ సీఎస్ జోషీని కోరడంతో... ఆయన ఢిల్లీ తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌తో మాట్లాడారు. ఇప్పటికే శ్రీనగర్ నుంచి జమ్మూకు బయల్దేరిన విద్యార్థులను అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకొచ్చేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఇక అక్కణ్నుంచి రైలులో విద్యార్థులను హైదరాబాద్ తీసుకురానున్నారు. విద్యార్థులతో నిరంతరం టచ్‌లో ఉన్నామని.. త్వరలోనే వారు సురక్షితంగా హైదరాబాద్ చేరుకుంటారని అధికారులు తెలిపారు.