గోదావరి వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని జన సైనికులకు పిలుపు ఇచ్చారు పార్టీ అధినేత పవన్. పోలవరం ముంపు ప్రాంతాలకు వెళ్లి బాధితులకు సహాయం అందించాలని అభిమానులకు సూచించారు పవన్. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్‌కు ఎయిర్‌పోర్టులో, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.. ఎన్నికల తరువాత తొలిసారి భీమవరం నుంచి ఆయన పార్టీ సమావేశాలు ప్రారంభించనున్నారు..
ఇవాళ, రేపు పార్టీ ముఖ్య నాయకులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. క్యాన్సర్‌తో ఇటీవల మృతి చెందిన జనసేన కార్యకర్త కొప్పినీడు మురళీకృష్ణ కుటుంబాన్ని రేపు ఉదయం పరామర్శిస్తారు. మద్యాహ్నం నరసాపురం పార్లమెంటరీ పరిధిలోని కార్యకర్తలతో ముఖిముఖి సమావేశంలో పాల్గొంటున్నారు.. అలాగే రణరంగం సినిమా ప్రచార కార్యక్రమంలో ఉన్న శర్వానంద్.. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వెళుతున్న పవన్ కళ్యాణ్ ని ఎయిర్ పోర్ట్ లో కలుసుకున్నారు.