రంగారెడ్డి జిల్లాలో మహిళ అనుమానాస్పద మృతి

Update: 2019-08-04 07:18 GMT

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం చింతపల్లిగూడ గేట్‌ సమీపంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి మహిళ మృతదేహాన్ని ఇక్కడ పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారంతో స్పాట్‌కు చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

యాదాద్రి జిల్లా మర్రిగూడ మండలం అజలపురం గ్రామానికి చెందిన సరితతో... గతేడాది కందుకూరు మండలం ముచ్చర్ల తండాకు చెందిన ఆటో డ్రైవర్‌ రాజుతో వివాహం జరిగింది. అయితే గత నాలుగు రోజుల క్రితం తన భార్య కనిపించడం లేదంటూ రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Similar News