సాధారణంగా పిచ్చి శునకాలు మనుషులను కరిచి గాయపరచడం చూశాం. కానీ పిచ్చి పిల్లి కరిచి గాయపరిచిందంటే ఆశ్చర్యం వేయక మానదు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం యర్రంశెట్టి పాలెంలో ఓ పిచ్చి పిల్లి వీరవిహారం చేసింది. అడ్డొచ్చిన వారిపై దాడి చేసి రక్కేసింది. అంతే కాదు మేకతో పాటు కుక్కపై కూడా దాడి చేసింది. రోజు గ్రామంలో ప్రజల మధ్య తిరిగే పిల్లి ఉన్నట్టుండి ఏమైందో ఏమో కానీ.. కనబడిన వారిని కనబడినట్లు దాడి చేసింది. ఐదుగురు మహిళలపై పిల్లి దాడి చేసింది. వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు పిల్లిని బంధించారు. గాయపడ్డ మహిళలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.