వైసీపీ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. రాష్ట్రమంతా పులివెందుల పంచాయతీ చేస్తారా అంటూ ఫైరయ్యారు. తప్పుడు కేసులు పెడితే.. తిరిగి కేసులు పెడతామని హెచ్చరించారు. పోలీసులు కేసులు తీసుకోకుంటే కోర్టుకు వెళతామని స్పష్టం చేశారు. టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఖండించారు చంద్రబాబు.