ఉన్నట్టుండి దారిన పోయే వాళ్లపై దాడి చేసిన యువతి

Update: 2019-08-07 12:58 GMT

కర్నూల్‌ నగరంలో ఓ మతిస్థిమితం లేని యువతి హల్‌చల్‌ చేసింది. జిల్లా పరిషత్‌ కూడలి వద్ద గుర్తు తెలియని యువతి ఉన్నట్లుండి ఒక్కసారిగా పిచ్చి పట్టినట్లు ప్రవర్తించింది. దారిన పోయే వారందరిపై రాళ్లతో దాడి చేసింది. ఈ దాడిలో ఓ వ్యక్తి తలకు తీవ్ర గాయమైంది. మోటార్‌ బైక్‌లపై వెళ్తున్న వారిని అడ్డుకుంది. పార్కింగ్‌ చేసిన వాహనాలను తోసేసింది. యువతి ప్రవర్తనతో అటుగా వెళ్తున్న వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు యువతిని అదుపులోకి తీసుకున్నారు.

Similar News