శ్రీశైలం డ్యామ్ గేట్లు తెరుచుకున్నాయి.. వరద పోటెత్తుతుండడంతో శ్రీశైలం జలాశయం నిండు కుండను తలపిస్తోంది.. దీంతో నాలుగు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.. మంత్రి అనిల్‌కుమార్ యాదవ్.. తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి గంగమ్మకు పూజలు నిర్వహించారు.. అనంతరం గేట్లను తెరిచారు.. దీంతో కృష్ణమ్మ పరుగులు పెడుతూ సాగర్ వైపు కదులుతోంది.. ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో సందర్శకులు కృష్ణమ్మ గలగలలను చూసేందుకు తరలివస్తున్నారు.