తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా. కేసీఆర్‌కు కుటుంబం మీద ఉన్న ప్రేమ.. రాష్ట్రంపై లేదన్నారు. మిషన్ కాకతీయ పేరిట కమిషన్ కాకతీయ చేశారని.. కాళేశ్వరం ప్రాజెక్టుకు 80 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు నీరు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. కాళేశ్వరం అనే పేరు ఎంతో పవిత్రమైనదని.. కానీ ఆ పేరుతో అపవిత్ర పనులు చేస్తున్నారని దుయ్యబట్టారు జేపీ నడ్డా.