హాంకాంగ్‌లో ఆగని ఆందోళనలు

Update: 2019-08-19 01:09 GMT

హాంకాంగ్‌లో ప్రజాగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. నేరస్థుల అప్పగింత బిల్లుపై నిరసన జ్వాలలు రగులుతున్నాయి. పదకొండు వారాలుగా నిరసనలతో హాంకాంగ్‌ అట్టుడుకుతోంది. ప్రజలంతా స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. జోరు వానలోనూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు.. నిరసనలు విరమించకుంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ఓ వైపు చైనా హెచ్చరికలు చేస్తున్నా ఉద్యమకారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పైగా తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తున్నారు.

కొద్దిరోజుల క్రితం హాంకాంగ్‌ ఎయిర్‌పోర్టును దిగ్బంధించిన నిరసనకారులు.. ఆ తర్వాత మరింత తీవ్రతరం చేశారు. నిత్యం వేలాదిగా ఆందోళనల్లో పాల్గొంటున్నారు. ఇక ఆదివారం భారీ వర్షంలోనూ గొడుగులతో శాంతియుత ప్రదర్శనలు చేపట్టారు. విక్టోరియా పార్కు నుంచి చేపట్టిన ఈ నిరసన ప్రదర్శనలకు సివిల్ హ్యూమన్ రైట్స్ ఫ్రంట్ నేతృత్వం వహించింది. హాంకాంగ్‌లో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకే ఆందోళనలు చేపడుతున్నట్లు ఆ సంస్థ పేర్కొంది.

Similar News