కరీంనగర్ జిల్లాలో ఓ రైతు అకస్మాత్తుగా సెలబ్రిటీగా మారిపోయాడు. అయితే పంటలు పండించి కాదు. ఆయన దగ్గరున్న ఎలక్ట్రిక్ బైక్‌తో.. దానిపై రయ్య్ మంటూ దూసుకుపోతుండడంతో జనం ఆసక్తిగా చూస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా, ఆయన చుట్టూ చేరి, ఎలక్ట్రిక్ బైక్ గురించే అడుగుతున్నారు.
వాహనాలు నడపడం కష్టమే. పైగా పెట్రోల్ భారం కూడా తప్పదు. అయితే ఎలక్ట్రిక్ బైక్ లు నడపడం సులువు. వృద్ధులు కూడా సులువుగా దూసుకుపోవచ్చు. ఎలక్ట్రిక్ బైక్ కు ఖర్చు కూడా తక్కువే. కొద్ది పాటి దూరాలకు అనువుగా ఉంటుంది.
కరీంనగర్ జిల్లా లింగయ్య అనే రైతుకు ఆయన కుమారుడు ఓ ఎలక్ట్రిక్ బైక్ కొనిచ్చాడు. పొలానికి, బంధువుల ఇంటికి దాని పైనే దూసుకెళ్తున్నాడు లింగయ్య. అయితే ఎలక్ట్రిక్ బైక్ కొత్తగా ఉండడంతో లింగయ్య సెలబ్రిటీగా మారిపోయాడు. ఆయన ఎక్కడికి వెళ్లినా ఆపి, బైక్ గురించే అడుగుతున్నారు. ఎలక్ట్రిక్ బైక్‌తో ఫోటోలు దిగుతున్నారు. ఎలక్ట్రిక్ బైక్ ను సంగారెడ్డిలో కొనుగోలు చేశారు. ఒకసారి రీ ఛార్జ్ చేస్తే, 45 కిలీ మీటర్లు ప్రయాణించవచ్చు.