ఏపీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌కు గుండెపోటు

Update: 2019-08-24 02:46 GMT

ఏపీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ ఆరోగ్యం పరిస్థితి కొంత నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. రాత్రి కోడెలకు తీవ్రమైన గుండెపోటు రావడంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆయన్ను గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అల్లుడు మనోహర్‌ పర్యవేక్షణలో వైద్యులు కోడెలకు చికిత్స అందిస్తున్నారు. రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత ఆందోళన కలిగించినా, ఆ తర్వాత నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.. కోడెల ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అటు పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు కూడా ఈ వార్త విని షాక్‌కు గురయ్యారు.

Full View

Similar News