బెడ్లు లేక నేలపై రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులు

Update: 2019-08-26 13:50 GMT

సర్కారీ ఆసుపత్రులు రోగుల సహనాన్ని పరీక్షిస్తాయనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది. గాంధీ ఆసుపత్రిలోని న్యూరో డిపార్ట్‌మెంట్‌లో రోగులకు బెడ్స్‌ లేవు. దీంతో రోగుల్ని నేలపై పడుకోపెట్టి వైద్యం చేస్తున్నారు డాక్టర్లు.

కొందరికి వారం రోజులుగా ఇలాగే కిందపడుకోబెట్టి చికిత్స చేస్తున్నారు. మరికొందరు పేషంట్లు నెల రోజులుగా ఇలానే అవస్థలు పడుతున్నారు. రోగులకు చికిత్స సంగతిపక్కనపెడితే కనీసం బెడ్లు కూడా లేకపోవడంపై రోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్య తెలంగాణ అంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు.

Full View

Similar News