టీజీ వెంకటేష్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని బీజేపీ నేతలు అంటున్నారు. పార్టీలో ఉన్నప్పుడు అంతా ఒక క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలని బీజేపీ నేత రఘురాం అభిప్రాయపడ్డారు. రాజధానిపై ఏపీ ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదని గుర్తు చేశారు. అమరావతి నిర్మాణంలో అవినీతిని నిగ్గు తేల్చాల్సిందేనని డిమాండ్ చేశారు.