ఐబీ హెచ్చరికలతో తిరుమలలో హై అలర్ట్ ప్రకటించారు. రద్దీ ప్రాంతాల్లో టీటీడీ విజిలెన్స్ అధికారుల ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. యాత్రికుల వసతి భవనాలు, బస్‌స్టాండ్, నడకదారిలో అనుమానితులు కనిపిస్తే విచారిస్తున్నారు. అనుమానాస్పద వస్తువులు, బ్యాగులు ఉంటే సమాచారం ఇవ్వాలని టీటీడీ విజిలెన్స్ అధికారులు విజ్ఞప్తి చేశారు. తిరుపతి నుండి తిరుమలకు వచ్చే వాహనాలను జి.ఎన్.సి. టోల్‌గేట్ దగ్గర తనిఖీలు చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.