మాజీ ప్రధాని మన్మోహన్‌ కు SPG భద్రత తొలగింపు

Update: 2019-08-26 04:47 GMT

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ -SPG భద్రతను తొలగించారు. ఇకపై ఆయనకు CRPF దళాలు భద్రతనిస్తాయి. ఈమేరకు కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ప్రతిఏటా SPG భద్రత ఎవరికి ఇవ్వాలనే దానిపై సమీక్ష నిర్వహిస్తారు. అందులో భాగంగానే మన్మోహన్‌కు SPG భద్రత తొలగించినట్టు హోంశాఖ పేర్కొంది.

SPG భద్రతను ప్రాణహాని ఉండే అత్యున్నతస్థాయి రాజకీయ నాయకులకు ఇస్తారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీతోపాటు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆమె కుమారుడు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలకు కల్పిస్తున్నారు. ప్రాణహాని ఉన్న మాజీ ప్రధానులకు, వారి కుటుంబ సభ్యులకు SPG ప్రొటెక్షన్‌ ఇస్తుంటారు. ఈ విషయంలో తాజాగా హోంశాఖ సమీక్ష నిర్వహించి మన్మోహన్‌ సింగ్‌కు SPG భద్రత తొలగించింది.

Similar News