భార్యకు రెవెన్యూ శాఖలో VRA ఉద్యోగం. అయితే.. ఆమె స్థానంలో రోజూ ఆఫీస్‌కి వెళ్లి పనులు చక్కబెట్టుకుంటున్నాడు ఆమె భర్త. ఏకంగా MRO సమక్షంలోనే ప్రభుత్వ ఉద్యోగిగా చెలామణి అవుతూ అందినకాడికి దోచుకుంటున్నాడు. ఆయనగారి దోపిడీతో చిర్రెత్తిన గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం తిమ్మాపూర్‌లో జరిగింది.
VRA సునీత భర్త రజనీకాంత్ గత కొద్ది నెలలుగా భార్య ఉద్యోగం చేస్తున్నాడు. ఇదేంటని గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. భార్య అరోగ్యం బాగాలేనందున ఇలా చేస్తున్నట్టు ఉన్నతాధికారులకు వివరించాడు రజనీకాంత్. ఇప్పటికీ అలాగే కంటిన్యూ అవుతున్నాడు. అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు.