శంషాబాద్ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో టైర్లలో పొగలు వచ్చాయి. పైలెట్ వెంటనే ఎయిర్‌పోర్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి వచ్చిన విమానంలోని 155 మంది ప్రయాణికులు సురక్షితంగా ల్యాండ్ అయ్యారు.