అక్రమాలు జరిగాయన్న పేరుతో రాజధాని మారుస్తామంటే చూస్తూ ఊరుకోమన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని..ఇప్పటికైనా సీఎం జగన్ రాజధానిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజధాని మార్పుకు జనసేన వ్యతిరేకమన్నారు. అమరావతిలో పర్యటిస్తున్న పవన్.. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు.