హైదరాబాద్ నగరంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పులు.. అపరిశుభ్రమైన వాతావరణం వెరసి రోగాలకు కారణమవుతున్నాయి. ప్రధానంగా స్వైన్ ఫ్లూ..డెంగీ,మలేరియాలు కూడ ప్రతాపాన్ని చూపిస్తుండటంతో జనాలకు తిప్పలు తప్పడం లేదు. ఏ హస్పిటల్ వైపు తొంగి చూసిన చాంతాడంతా క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి.
మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు పట్టి పీడిస్తున్నాయి. పిల్లలు, వృద్ధులు, గర్భిణీ మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జ్వరం, గొంతు నొప్పి, వాంతులతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఏ హస్పిటల్‌లో తొంగి చూసిన రోగుల కిటకిటలాడుతున్నాయి.
జ్వరం, దగ్గు, జలుబు, ముక్కు నీటి నుంచి నీటిధార నిరంతరంగా రావడం, గొంతు గరగర, ఒల్లు నొప్పులు, అలసట, నీరసం, వాంతులు, విరేచనాలు, ఆకలి లేకపోవడం తదితర సమస్యలతో రోగులు హస్పిటల్స్ కు బాట పట్టారు. హైదరాబాద్‌లో అపరిశుభ్ర వాతావరణం నెలకొనడంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. దీంతో డెంగీ కేసులు ఎక్కువవుతున్నాయి. దీనికి తోడు మలేరియా,చికన్ గున్యా అధికమవుతుంది.