నేను సూర్యాపేట జిల్లా కలెక్టర్ సురేంద్ర మోహన్ మాట్లాడుతున్నా.. మా వాళ్లు హుజూర్‌నగర్ వచ్చారు. వాళ్లకు బిర్యానీ పెట్టించండి అని హుజూర్‌నగర్ తహసీల్దార్ సూరిగి సైదులుకు ఫోన్ కాల్ వచ్చింది. మాటల్లో తేడా కనిపించి హోటల్‌కు తనసిబ్బందిని పంపారు తహసీల్దార్. ఒకరు పరారు కాగా మరొకరిని పోలీసులకు అప్పగించారు.
కలెక్టర్ పేరుతో ఫోన్ చేసినవారిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హజూర్‌నగర్‌కు చెందిన అరవింద్, అమరవరం కు చెందిన జిట్టబోయిన నరేష్‌లుగా పోలీసులు గుర్తించారు. నిందితుల ఫోన్ ట్రూ కాలర్‌లోనూ సురేంద్ర కుమార్ IAS అని రావడంతో అవాక్కయ్యారు తహసీల్దార్.