టీడీపీ నేతల జోలికి వస్తే ఖబడ్దార్ - చంద్రబాబు

Update: 2019-09-01 01:35 GMT

ఏపీ ప్రభుత్వం విఫలం అయ్యిందంటూ అవకాశం ఉన్న ప్రతీ చోట హైలెట్ చేస్తోంది టీడీపీ. ట్విట్టర్ వేదికగా మరోసారి జగన్ ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు.. ప్రజాసమస్యలని పరిష్కరించడం చేతకాని రాష్ట్ర ప్రభుత్వానికి కూల్చడం ఒక్కటే తెలిసినట్టుందని ఎద్దేవా చేశారు. బతుకుల్ని కూల్చే చరిత్ర కలిగినవాళ్ళు అధికారంలోకి వస్తే ఇలాగే ఉంటుందన్నారు. అమరావతి, పోలవరం పనులను ఆపేసి ప్రజల ఆకాంక్షల్ని కూల్చేశారు. తుగ్లక్ నిర్ణయాలతో పరిశ్రమలను వెళ్ళగొడుతూ ప్రగతిని కూల్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇసుక కొరతతో లక్షల మంది పేదల ఉపాధి మార్గాలను కూల్చిన ప్రభుత్వం.. చివరికి వారి ఇళ్ళను కూడా కూల్చేసి నిలువనీడ కూడా లేకుండా చేస్తారా? అని ప్రశ్నించారు. దేన్నైనా సహిస్తాం కానీ పేదల జోలికివస్తే టీడీపీ చూస్తూ ఊరుకోదని వార్నింగ్ ఇచ్చారాయన.

టీడీపీ నేతల ఇళ్లపై దాడులపై ఫైర్ అయ్యారు చంద్రబాబు. గ్రామాలను ఖాళీచేసి వెళ్ళిపోవాలని బెదిరిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ వేధింపులకు నిరసనగా సెప్టెంబర్ 3 నుంచి టీడీపీ ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతుందని ప్రకటించారు. మంగళవారం నుంచి గుంటూరులో వైసీపీ బాధితుల పునరాశ్రయ శిబిరాన్ని నిర్వహిస్తామన్నారు చంద్రబాబు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. సోమవారం వినాయక చవితి ఉన్నా.. సెలవుల పేరుతో జీతం ఆపటాన్ని తప్పుబట్టారు. ప్రజలు అప్పులు చేసి పండగ చేసుకోవాలా అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నెలాఖరులో దసరా వస్తే.. ప్రత్యేక జీవో ద్వారా ముందే జీతాలు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

Similar News