కడప జిల్లా పులివెందులలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులతో సమావేశమైన ఆయన... నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా యూసీఐఎల్ కాలుష్యంపై ఆరా తీశారు.
పులివెందులో సమీక్షకు ముందు జగన్ కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయకు వెళ్లారు. తన తండ్రి, దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి 10వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. జగన్ తో పాటు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి వైఎస్ కు అంజలి ఘటించారు.
జగన్ తన తండ్రి వైఎస్ కు నివాళులర్పించిన తర్వాత భాకరాపురంలో మాజీ మంత్రి, తన బాబాయ్ వైఎస్.వివేకానందరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు.