భారత్ చేరిన అపాచీ ఏహెచ్‌-64 హెలికాప్టర్‌.. స్పెషాలిటీ ఏంటో తెలుసా?

Update: 2019-09-03 05:54 GMT

అమెరికా యుద్ధ హెలికాప్టర్‌ అపాచీ ఏహెచ్‌-64 భారత వాయుసేన అమ్ములపొదిలో చేరింది. అమెరికాకు చెందిన బోయింగ్‌ విమాన సంస్థ ఇవాళ అపాచీ యుద్ధ హెలికాప్టర్లను భారత్‌కు అందించింది. పంజాబ్‌లోని పఠాన్‌ కోట్‌ ఎయిర్ బేస్ లో ఈ అత్యాధునిక యుద్ధ విమానాలకు పూజలు చేసి ఘనంగా ప్రారంభించారు ఎయిర్‌ ఫోర్స్‌ చీఫ్‌ బీఎస్‌ ధనోవా. వీటి చేరికతో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ మరింత బలోపేతం కానుంది.

అత్యాధునిక యుద్ధ హెలికాప్టరైన అపాచీ అన్ని వాతావరణ పరిస్థితుల్లో పని చేస్తుంది. గగన తలమే కాదు.. నేలపై కూడా టార్గెట్లను చేధించగలదు. ఇప్పటికే ఈ హెలికాప్టర్‌కు సంబంధించి అన్ని రకాల ముందస్తు పరీక్షలు పూర్తి చేసినట్లు భారత వాయుసేన అధికారులు ప్రకటించారు. అపాచీ ఏహెచ్‌-64 విమానాలు తొలిసారిగా ఎఎఫ్‌ఎస్‌ హిండన్‌ ఎయిర్‌ బేస్‌లో తొలిసారిగా గాలిలోకి ఎగిరాయి. మొత్తం 8 హెలికాప్టర్లు భారత వాయుసేనకు అందాయి.

2015 సెప్టెంబ‌ర్‌లో 22న అపాచీ హెలికాఫ్టర్ల కోసం అమెరికా ప్రభుత్వం, బోయింగ్‌తో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది. కాంట్రాక్ట్‌పై సంతకం చేసింది. ఇందులో భాగంగా ఇవాళ 8 హెలికాప్టర్లు భారత్‌కు అందగా.. మిగిలిన14 చాపర్లు 2020 నాటికి భారత్‌కు చేరనున్నాయి. అపాచీ హెలికాప్టర్ల నిర్వహ‌ణ కోసం ఇప్పటికే మన ఎయిర్‌ ఫోర్స్‌ ట్రైనింగ్ కూడా తీసుకుంది. అల‌బామాలోని ఫోర్ట్ రూక‌ర్ ఆర్మీ బేస్‌లో శిక్షణ ఇచ్చారు.

Similar News