వినియోగదారులను ఆకర్షించడానికి డిస్కౌంట్లు, ఆఫర్‌లు ప్రకటిస్తుంటాయి మొబైల్ కంపెనీలు. నిన్నటి వరకు రూ.27,999ఉన్న నోకియా 8.1 ఫోన్ ధర ఇప్పుడు ఏకంగా రూ.12,000లు తగ్గి 15,999కి వచ్చేస్తుంది. 4జీబీ ర్యామ్, 64 జీబీ మెమోరీతో లభిస్తోంది. రూ.22,999కు 6 జీబీ+128 జీబీ వేరియంట్ ఫోన్ లభిస్తోంది. నోకియా ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ డిస్కౌంట్ ధరలకే నోకియా 8.1స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
నోకియా 8.1 ప్రత్యేకతలు.. 6.18 ఫుల్ హెచ్‌డీ + డిస్‌ప్లే, 1080 x 2244 పిక్సెల్స్ డిస్‌ప్లే రిజల్యూషన్. 4జీబీ, 6 జీబీ ర్యామ్, 64 జీబీ, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, స్నాప్ డ్రాగన్ 710 ప్రాసెసర్, 12+ 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 3,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 4 జీబీ +64 జీబీ- రూ. 15,999, 6జీబీ+128జీబీ-రూ.22,999.