తీవ్రమైన తుఫాన్.. 2500 మంది మిస్సింగ్!

Update: 2019-09-12 14:18 GMT

డొరియన్ హరికెన్ బహమాస్ ద్వీపాన్ని అతలాకుతలం చేసింది. ఈ తుఫాన్ దేశంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని ప్రధానమంత్రి హుబర్ట్ మిన్ని అన్నారు. దీని ప్రభావంతో 50మంది మరణించారని, 2వేల 5వందల మంది కనిపించకుండా పోయినట్లు ఆయన తెలిపారు. మరణాల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆయన అన్నారు. రికార్డు స్థాయిలో ప్రజలను ఇళ్లను ఖాళీ చేయించి శిబిరాలకు తరలించినట్లు ప్రధాని వివరించారు. ఇప్పటికీ వేలాదిమంది శిబిరాల్లో తలదాచుకుంటున్నారని, సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు వెల్లడించారు. పరిస్థితి సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పడుతుందన్నారు.

Also watch :

Full View

Similar News