మీటర్‌ రీడింగ్‌ నమోదులో అవకతవకలు : బీజేపీ ఆందోళన

Update: 2019-09-12 03:08 GMT

బెంగాల్‌లో బీజేపీ ఆందోళన ఉద్రిక్తంగా మారింది. విద్యుత్‌ బిల్లులు పెంచడాన్ని నిరసిస్తూ... కోలకతా ఎలక్ట్రిక్‌ సప్లై కార్పోరేషన్‌ ముందు ఆందోళనకు దిగారు బీజేపీ కార్యకర్తలు. ఎలక్ట్రిక్‌ కార్పోరేషన్‌ కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు.. టియర్‌ గ్యాస్‌ షెల్స్‌, వాటర్‌ కెనాన్లు ప్రయోగించారు. ఈ ఘటనలో బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు.

కరెంట్ ఛార్జీల పెంపుతో పాటు మీటర్‌ రీడింగ్‌ నమోదులో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ.. బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నినాదాలు చేస్తూ.. ఆఫీస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. చాందీని చౌక్‌ మెట్రో స్టేషన్‌కు సమీపంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో రంగంలో దిగిన పోలీసులు.. ఆందోళన కారుల్ని చెదరగొట్టేందుకు వాటర్‌ కెనాన్లు, టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు.

Similar News