Karnataka : కర్ణాటకలో సెక్స్​ స్కాం రచ్చ.. రేవన్న పరార్

Update: 2024-04-29 07:38 GMT

కర్ణాటకలో 2024 లోక్​సభ ఎన్నికలు ఉత్కంఠగా మారాయి. కర్ణాటక సెక్స్ కుంభకోణం సంచలనం రేపుతోంది. జేడీఎస్ నేత, హసన్​ ఎంపీ, మాజీ ప్రధానమంత్రి మంత్రి హెచ్​డీ దేవేగౌడ మనవడు ప్రజ్వల్​ రేవన్నపై వచ్చిన లైంగిక దాడి ఆరోపణలు సంచలనం సృష్టించాయి.

ఓ మహిళను ఆయన చాలా కాలం పాటు లైంగికంగా హింసించాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించిన అశ్లీల దృశ్యాలు.. హసన్​ జిల్లాలో సర్క్యులేట్​ అవుతున్నాయి. ప్రజ్వల్​ రేవన్న.. హెచ్​డీ రేవన్న కుమారుడు. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి.. రేవన్నకు బాబాయ్​ వరుస అవుతారు.

వైరల్ వీడియోలో బాధితురాలు ప్రజ్వల్​ రేవన్న ఇంట్లో పని చేసినట్టు తెలుస్తోంది. ఆమె ఫిర్యాదుతో.. రేవన్నపై పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు. ప్రజ్వల్​ రేవన్న అశ్లీల దృశ్యాలకు సంబంధించి.. పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసుకోగా.. అధికారంలోని కాంగ్రెస్​ ప్రభుత్వం.. దర్యాప్తు చేపట్టేందుకు సిట్​ని నియమించింది. ఒకవేళ ప్రజ్వల్​ రేవన్న దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతే.. ఆయన్ని వెనక్కి తీసుకొచ్చే బాధ్యత సిట్​ టీమ్​దే అని కుమారస్వామి తెలిపారు. జేడీఎస్ మిత్రపక్షం ఈ విషయంలో సైలెంట్ గా ఉంది.

Tags:    

Similar News