సాధారణ ఎన్నికల తరువాత దేశంలోని ప్రతిపక్షాలకు వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో ఎన్సీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఛత్రపతి శివాజీ 13వ వారసుడు సతారా సిట్టింగ్ ఎంపీ ఉదయన్‌రాజ్ భోంస్లే బీజేపీలో చేరారు. శనివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు, హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో ఆయన బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. మోదీ, అమిత్ షా నాయకత్వంలో దేశం అభివృద్ధి పధంలో దూసుకుపోతోందని అన్నారు. ఫడ్నవిస్‌తో కలిసి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామి అవుతానని తెలిపారు. కాగా ఉదయన్‌రాజ్ రాజీనామాతో ఎస్సీపీ, కాంగ్రెస్ శ్రేణులు విస్మయానికి గురయ్యాయి.