వేరే మహిళతో సహజీవనం చేస్తున్న భర్తకు బడితె పూజ చేసింది భార్య. రెడ్ హ్యండెడ్‌గా పట్టుకుని పతిని చితకబాదింది. తన భర్త వేరే మహిళతో ఓ ఇంట్లో సహజీవనం చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న భార్య.. కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి చేరుకుంది. భర్తను చితకబాది నిలదీసింది. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్ నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.