రానున్న మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Update: 2019-09-22 01:23 GMT

ఉపరితల ఆవర్తనంతో తెలంగాణలోని పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు ముంచెత్తగా.. జగిత్యాల, మహబూబాబాద్‌, నల్గొండ, నిజామాబాద్‌ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. ఖమ్మం జిల్లాలో 4.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.. ఇక ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా సగటుకు మించి వర్షాలు పడ్డాయి.. ఉత్తర తెలంగాణలో అధిక వర్షపాతం నమోదైంది. ఈనెలాఖరు వరకు తెలంగాణలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అటు ఉత్తర కోస్తా తీరానికి దగ్గరలో, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.. రాయలసీమలో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలతోపాటు ఉభయ గోదావరి జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Also watch :

Full View

Similar News