నైరుతి రుతుపవనాలు మే 31 న షెడ్యూల్ కంటే ఒక రోజు ముందుగానే భారత ప్రధాన భూభాగంలోకి వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. జూన్ 1న కాదు.. మే 31 ననే సాధారణంగా నైరుతి రుతుపవనాలు కేరళలోకి జూన్ మొదటి వారంలో ప్రవేశిస్తాయి. ఈ సంవత్సరం కూడా జూన్ 1 వ తేదీన కేరళలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని గతంలో ఐఎండీ తెలిపింది.
తాజాగా, జూన్ 1 కన్నా ఒక రోజు ముందుగానే, అంటే మే 31వ తేదీననే రుతుపవనాలు భారత్ లో ప్రవేశిస్తాయని వెల్లడించింది. అయితే, వాతావరణ పరిస్థితుల్లో ఏవైనా మార్పులు చోటు చేసుకుంటే 4 రోజులు అటు ఇటుగా రుతుపవనాలు భారత్ లోకి ఎంటర్ అవుతాయని తెలిపింది. ఈ సంవత్సరం దీర్ఘకాలిక సగటులో 106% వద్ద "సాధారణం కంటే ఎక్కువ" వర్షపాతం ఉండే అవకాశం ఉందని ఐఎండీ ఏప్రిల్ 15 న తన దీర్ఘకాలిక అంచనాలో తెలిపింది.
సాధారణంగా జూలై 15 నాటికి దేశ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయి. నైరుతి రుతుపవనాలు భారత్ లో వ్యవసాయానికి అత్యంత కీలకమైనవి. ఇది చాలా మంది భారతీయ రైతుల జీవనోపాధి వీటిపై ఆధారపడి ఉంటుంది. ఇవి ఆహార ద్రవ్యోల్బణం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై బలమైన ప్రభావం చూపుతాయి.