సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ ఎన్నికయ్యారు. గురువారం సాయంత్రం జరిగిన ఎన్నికల్లో సిబల్ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆయనకు 1066 ఓట్లు వచ్చాయి.
సమీప అభ్యర్థి, సీనియర్ న్యాయవాది ప్రదీప్ రాయ్‌కు 689 ఓట్లు వచ్చాయి. దీంతో కపిల్ సిబల్ విజయం సాధించినట్లు ప్రకటించారు. సుప్రీం కోర్టు బార్ అధ్యక్షుడిగా కపిల్ సిబల్ ఎన్నిక కావడం ఇది నాలుగో సారి. 1996-96, 1997-98, 2001-02 సంవత్సరాల్లో సిబల్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. తాజాగా 2024-25 సంవత్సరానికి మరోమారు ఎన్నికయ్యారు.
అధ్యక్ష పదవికి ఆరుగురు పోటీపడ్డారు. ప్రస్తుత అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది డాక్టర్ ఆదిష్ సి. అగర్వాల్‌కు కేవలం 296 ఓట్లు మాత్రమే వచ్చాయి. విజయం సిబల్‌ను వరించింది. సుప్రీం కోర్టు బార్ అధ్యక్షుడిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిబల్ ఎన్నిక కావడంపై ఆ పార్టీ నాయకుడు జైరాం రమేశ్ హర్షం వ్యక్తం చేశారు