కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ ఎంపీ రేణుకా చౌదరి ఖమ్మం కోర్టుకు హాజరయ్యారు. 2009 ఎన్నికల్లో వైరా అసెంబ్లీ టికెట్ ఇప్పిస్తామని మోసం చేశారనే కేసులో ఆమె కోర్టుకు వచ్చారు.
రేణుకా చౌదరి అసెంబ్లీ టికెట్ ఇప్పిస్తామని చెప్పి తన భర్త రాంజీనాయక్ నుంచి కోటి 40 లక్షల రూపాయాలు వసూలు చేసి మోసం చేశారని ఆయన భార్య ప్రభావతి ఆరోపించారు. రేణుకా చౌదరి మోసం చేయడం వల్లే తన భర్త రాంజీనాయక్ మృతి చెందాడని ఆరోపిస్తూ ఆయన భార్య ప్రభావతి కోర్టులో కేసు వేశారు.
ఈ కేసు విచారణకు గతంలో రేణుక హాజరు కాకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆమె సోమవారం కోర్టు ముందు హాజరయ్యారు.
Also watch :