మున్సిపల్ పోరుపై బీజేపీ స్పెషల్ ప్లాన్..!

Update: 2026-01-08 05:12 GMT

పంచాయతీ ఎన్నికల్లో ఘోరమైన విఫలం పొందిన బీజేపీ పార్టీ.. ఇప్పుడు తెలంగాణ మున్సిపల్ఎన్నికల్లో బలమైన సీట్లు సాధించాలని డిసైడ్ అయింది. ఇందుకోసం పురపోరులో ప్రత్యేకమైన ప్లాన్ రెడీ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు, రాష్ట్రానికి ఏం చేసిందో బలంగా ప్రచారం చేసుకోవాలని చూస్తున్నారు బీజేపీ నేతలు. కమలం పార్టీకి గ్రామాల్లో కంటే అర్బన్ ఏరియాల్లోనే బలమైన పట్టు ఉంటుంది కాబట్టి దాన్ని ఈ ఎన్నికల్లో నిరూపించుకోవాలని చూస్తోంది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు రాం చందర్ రావుతో కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వ్యూహాలు రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎలాంటి విధానాలు అమలు చేస్తోందో.. వాటితో ఎలాంటి నష్టాలు వాటిల్లుతాయో ప్రజలకు వివరించాలని అనుకుంటున్నారు.

అలాగే జీ రామ్ జీ చట్టంపై ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న ప్రచారాన్ని కూడా తిప్పి కొట్టాలని డిసైడ్ అయ్యారు. అలాగే కాంగ్రెస్ పార్టీ హిందువులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుందోని చెప్పాలని ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు కృష్ణా జలాల్లో కాంగ్రెస్, బీఆర్ ఎస్ విధానాల వల్లే తెలంగాణకు అన్యాయం జరుగుతోందని.. తమ పార్టీ అధికారంలోకి వస్తే వాటిని సాధించితీరుతాం అంటూ ప్రచారాలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు.

ఆయా జిల్లాలల్లో ఉన్న కీలక నేతలే ఈ ఎన్నికల బాధ్యతలను తీసుకుంటున్నారంట. ఉత్తర తెలంగాణలో ప్రధానంగా బండి సంజయ్, ఈటల రాజేందర్ నాయకత్వంలోనే ఆ మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లను గెలుచుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. అటు ధర్మపురి అరవింద్, ఇటు దక్షిణ తెలంగాణలో డీకే అరుణ లాంటి వారు పోరుకు రెడీ అవుతున్నారు. మరి పంచాయతీ ఎన్నికల్లో డీలా పడ్డ ఆ పార్టీ మున్సిపల్ల ఎన్నికల్లో ఎలాంటి రిజల్ట్ సాధిస్తుందో చూడాలి.

Tags:    

Similar News