హైదరాబాద్ శివారు రాయదుర్గంలో ఓ నీటి సంపు ప్రాణాల మీదకు తెచ్చింది. నిర్మాణంలో భాగంగా సంపులోకి దిగిన ఇద్దరు కార్మికులు ఊపిరాడక అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే విషయం తెలుసుకున్న జీహెచ్‌ఎంసీ డిజాస్టర్ రెస్క్యూ బృందం ప్రమాద స్థలానికి చేరుకుంది. సంపులో అపస్మారక స్థితిలో పడిపోయిన కార్మికులను బయటకు తీసింది రెస్క్యూ బృందం. అనంతరం ప్రాథమిక చికిత్స నిర్వహించి.. ఆస్పత్రికి తరలించారు. సెంట్రింగ్ మెటీరియల్‌ను తొలగించేందుకు కార్మికులు సంపులోకి దిగినట్లు తెలుస్తోంది.
Also watch :