గుడ్‌న్యూస్.. బ్యాంకుల సమ్మె..

Update: 2019-09-25 09:27 GMT

విలీనాన్ని వ్యతిరేకిస్తూ పలు బ్యాంకులు సమ్మె సైరన్ మోగించాలనుకున్నాయి. కానీ ఉద్యోగ సంఘాల నాయకులతో కేంద్ర ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్ జరిపిన చర్చలు సఫలం కావడంతో తాత్కాలికంగా సమ్మె విరమించుకున్నారు. విలీనంతో ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీంతో బ్యాంకు ఉద్యోగులు సమ్మెపై వెనక్కి తగ్గారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే నిరసన చేపడతామని వారు వెల్లడించారు. 26,27 తేదీల్లో సమ్మె జరిగితే, 28, 29 తేదీలు శని, ఆది వారాలు వస్తున్నాయి. ఇలా వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు మూతపడితే ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కుంటారని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

Similar News