హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10మంది అక్కడికక్కడే మరణించారు. జింద్-హన్సి మార్గంలో మంగళవారం రాత్రి 10.30 గంటలకు స్పీడుగా వస్తూ ప్రయాణీకులతో వెళుతున్న ఓ ఆటోను ఢీకొట్టింది. ఆటోలో ఉన్న వారంతా యువకులేనని వారు ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీకి వెళ్లి వస్తున్నట్లు తెలిసింది. మృతుల్లో అయిదుగురు ఒకే గ్రామానికి చెందిన వారని డిప్యూటీ ఎస్పీ తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్‌ను విచారిస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి దారి తీసిందని విచారణలో వెల్లడైంది.