నిజామాబాద్ ఆర్యనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. నిజామాబాద్ రూరల్ తహసీల్దార్ జ్వాలగిరి రావు ఆత్మహత్య చేసుకున్నారు. నల్గొండ వాస్తవ్యుడైన జ్వాలగిరి రావు తన ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పపడ్డాడు. అయితే అతడి ఆత్మహత్యకు కారాణాలేంటన్నవి పూర్తిగా తెలియడం లేదు. ఎన్నికల తరువాత బదిలీలు లేక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆత్మహత్య విషయం తెలియగానే జిల్లా కలెక్టర్ రాం మోహన్ రావు. సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.