హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గంటపాటు కురిసిన భారీవర్షంతో రహదారులు చెరువులను తలపించాయి.. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సికింద్రాబాద్, మలక్‌పేట్, సైదాబాద్, కర్మాన్ ఘాట్, అల్వాల్ , నేరేడ్ మెట్ , దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాల్లో కురిసిన కుండపోతకు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పలుచోట్ల ట్రాఫిక్ జాం అయింది. క్యూములోనింబస్ మేఘాలతో కుండపోత వానలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.