నిధుల దారిమళ్లింపు కేసులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాషశ్‌ను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు.. టీవీ 9 మాజీ ఉద్యోగి కేవీఎన్ మూర్తిని అరెస్టు చేసి విచారిస్తున్నట్లు సమాచారం. గతంలో నిధుల మళ్లింపుపై అలంద మీడియా రవి ప్రకాశ్‌పై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రెండు రోజుల క్రితం కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దరినీ శనివారం అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నిధులు ఎలా దారి మళ్లించారు అన్నదానిపై ఆరా తీసినట్లు తెలుస్తోంది.
మొత్తం రూ. 18 కోట్ల 31 లక్షలు దారి మళ్లించినట్లు అలంద మీడియా ఆరోపిస్తోంది. 18 సెప్టెంబర్ 2018 నుంచి 8 మే 2019 వరకు నిధుల మళ్లింపు జరిగినట్లు అలంద మీడియా ఫిర్యాదులో పేర్కొంది.