తాడేపల్లిగూడెంలో ఎస్వీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మెగాస్టార్.. 120 మంది పోలీసుల..

Update: 2019-10-06 05:14 GMT

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మెగాస్టార్ చిరంజీవి పర్యటిస్తున్నారు. హౌసింగ్ బోర్డు కాలనీలోని ఎస్వీఆర్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన 9 అడుగుల 3 అంగుళాల ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని ఆయన అవిష్కరించనున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న చిరంజీవికి అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.

అక్కడి నుంచి సుమారు 250కిపైగా కార్లతో ర్యాలీగా తాడేపల్లిగూడెం వెళ్లారు. మార్గ మధ్యంలో అక్కడక్కడా అభివాదం చేస్తూ.. చిరంజీవి ముందుకు సాగారు. కాసేపట్లో గూడెంలో విగ్రహావిష్కరణ తర్వాత.. అక్కడ ఏర్పాటు చేసిన సభలో మెగాస్టార్ మాట్లాడతారు. దాదాపు 45 నిమిషాలు చిరంజీవి ప్రసంగం ఉంటుందని అభిమాన సంఘాల ప్రతినిధులు చెప్తున్నారు. చిరంజీవి పర్యటనకు 120 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఉంగుటూరు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు వట్టి వసంత్, ఈలి నాని.. SVR విగ్రహవిష్కరణకు ఏర్పాట్లన్నీ దగ్గరుండి పర్యవేక్షిస్తుస్తున్నారు. అఖిల భారత చిరంజీవి అధ్యక్షులు రవణం స్వామినాయుడుతోపాటు మరికొందరు కూడా చిరు వెంట ఉన్నారు.

Similar News