రాయల్ వశిష్ట బోటు వెలికితీతను రాజకీయాలకు వాడుకుంటున్నారన్నారు పర్యాటక శాఖామంత్రి అవంతి శ్రీనివాస్. రాజమహేంద్రవరంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. బోటు ప్రమాదాన్ని ఇప్పటికి కొందరు రాజకీయాలకు వాడుకుంటున్నారన్నారు. తనకు పర్యాటక బోట్లు ఉన్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారన్నారు. తనకు సొంత బోట్లు ఉన్నట్లు నిరూపిస్తే.. వారికే రాసిస్తానన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్. బోటు వెలికితీతపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని.... బోటును బయటకు తీసే వరకు మానవ ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్.