గోదావరి బోటు ప్రమాదం వెనుక ఉన్న నిజాలు బయటపెట్టినందుకే దళితనాయకుడు హర్షకుమార్‌ను కేసుల పేరుతో వేధిస్తారా అని ప్రశ్నించారు టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేశ్. ఈ ప్రభుత్వానికి సిగ్గులేదా అంటూ ట్విట్‌గా చేశారు లోకేశ్. గోదావరిలో 144 సెక్షన్ పెట్టిన మేధావి జగన్‌గారు ..... బోటుని తీయలేడా అని ప్రశ్నించారు లోకేశ్. ఇది చేతగాని దద్దమ్మ ప్రభుత్వం అనేందుకు ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలంటూ ట్వీట్ చేశారు లోకేశ్.
బోటు ప్రమాదం వెనుక ఉన్న రహస్యం... జలసమాధి చేయాలని చూస్తున్నారన్నారు. అలా చేసేందుకు ప్రయత్నించినంత మాత్రాన నిజాలు దాగవన్నారు లోకేశ్. ప్రమాదం జరిగిన రోజు డ్యూటీలో ఉన్న ఎస్సైకి ఫోన్ చేసి ఆపేసిన బోటును.... వదలిపెట్టాలని ఒత్తిడి చేసిన వ్యక్తి పేరు బయటపెట్టాలని డిమాండ్ చేశారు లోకేశ్. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలన్నారు.