తాము ప్రభుత్వ ఉద్యోగులమని మరిచారు. ఏకంగా ఎక్సైజ్ ఆఫీస్‌నే బార్‌గా మార్చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లోని ఎక్సైజ్ ఆఫీసులో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌తో పాటు ఎక్సైజ్ డ్రైవర్ మందు పార్టీ ఏర్పాటు చేసుకుని ఎంజాయ్ చేశారు. విధులను మరిచి ఆఫీసులోనే తాగి ఊగారు. సుల్తాన్‌పూర్‌లోని వైన్ షాపులో మద్యం అధిక ధరలకు అమ్ముతున్నారని ఆరోపిస్తూ.. సీపీఐ నాయకులు స్థానిక ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఎక్సైజ్ సిబ్బంది మందు పార్టీలో మునిగిపోవడం చూసి అవాక్కయ్యారు. డ్యూటీ టైంలో మందు కొడుతున్న ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని నాయకులు, స్థానికులు డిమాండ్ చేశారు.