విజయనగరం జిల్లా కొత్తవలసలో ప్రభుత్వ జూనియర్ కాలేజి భవనాలు ఒక్కసారిగా కుప్పకూలాయి. దీంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దసరా సెలవులు కావడంతో విద్యార్థులు లేక పెను ప్రమాదం తప్పింది. ఒక వేళ విద్యార్థులు ఉండి ఉంటే భారీగా ప్రాణ నష్టం సంభవించి ఉండేది.
కాలేజీ భవనాలు శిథిలావస్థకు చేరుకోవడంతో గతంలోనే విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి భవనాలను ప్రభుత్వం ముందే గుర్తించి తొలగించాల్సిన అవసరం ఉందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.