దసరా ఉత్సవాలను ఒక్కో చోట ఒక్కో విధంగా జరుపుకుంటారు. సంప్రదాయానికి ప్రాధాన్యతనిస్తూ అనాదిగా వస్తున్న ఆచారాలను కొనసాగిస్తుంటారు ప్రజలు. ఇక దసరా ఉత్సవాలు అంటే చాలాచోట్ల దుర్గామాతను పూజించడం జరుగుతుంటుంది. కానీ తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం భీమ భక్తినిపాలెంలోని ప్రజలు వినూత్నంగా దసరా ఉత్సవాలను జరుపుకుంటారు. దసరా పండుగ రోజున శ్రీరామనవమి వేడుకులను నిర్వహించడం ఇక్కడి గ్రామస్థుల ఆనవాయితి. గత 100 సంవత్సరాలకుపైగా ఇక్కడ దసరా రోజున శ్రీరామనవమి ఉత్సవం జరుపుకునే ఆచారం కొనసాగుతుందని అక్కడి ప్రజలు తెలుపుతున్నారు.