రైతు భరోసా పథకంలో సిత్రాలు.. అర్హుల జాబితాలో సాక్షాత్తూ ఏపీ మంత్రి..

Update: 2019-10-11 04:52 GMT

పేద రైతులు మాత్రమే అర్హులు అంటూ ఏపీ ప్రభుత్వం ప్రకటించిన రైతు భరోసా పథకంలో సిత్రాలు ఒక్కక్కటిగా వెలుగుచూస్తున్నాయి. 5 ఎకరాలు మించకూడదు... ఆదాయపన్ను చెల్లించేవారు కూడా అర్హులు కాదు అని గొప్పలు చెప్పారు. కానీ సాక్షాత్తూ ఏపీ మంత్రినే అర్హుల జాబితాలో చేర్చారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉండడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం గణపవరం గ్రామంలో ఖాతా నెంబర్ 1881లో మంత్రిని అర్హుడిగా చేర్చారు అధికారులు.

Full View

ఆదిమూలపు సురేష్ గతంలో ఉన్నతాధికారిగానూ పనిచేశారు. అంతేకాదు... చాలాకాలంగా ఆయన ఇన్ కం ట్యాక్స్ కడుతున్నారు. ఇది ఆయన ఎన్నికల అఫడవిట్ లో స్పష్టంగా ఉంది. మరి ఆదాయపన్ను కట్టే మంత్రిని రైతు భరోసా జాబితాలో ఎలా చేర్చారు? ఎవరు చేర్చారు? ఇది అధికారులు చేసిన పొరపాటా? లేక ఉద్దేశపూర్వకంగా పార్టీపై ప్రేమతో ఇచ్చిన కానుకా అంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. ఐదెకరాలు ఉన్నా దుర్భర దారిద్ర్యంలో ఉన్న రైతులకు అమలు చేయని ప్రభుత్వం.. మంత్రులకు మాత్రం పేదవాళ్లుగా గుర్తించి రైతు భరోసా ఇస్తుందని ఆరోపిస్తున్నారు.

Similar News